రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామశివారులో మంగళవారం రాత్రి 11గం.లకు జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన అల్వాల రాకేష్(21) అనే యువకుడు మృతి చెందినట్టు, ప్రస్తుతం రాగుల అరవింద్ కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రామడుగు ఎస్సై సురేందర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోపాలరావుపేట గ్రామానికి చెందిన స్నేహితుడు రాగుల అరవింద్(24)తో కలిసి రాకేష్ గ్రామంలో జన్మదిన వేడుకలలో పాల్గోన్న అనంతరం చోప్పదండి మండల కేంద్రంలోని దాబాలో డిన్నర్ చేయడానికి ఇద్దరూ మోటార్ సైకిల్ నంబర్ టిఎస్ 7హెచ్ ఎక్స్ 9774పై వెళ్ళారు. వెంకట్రావుపల్లి గ్రామశివారులోని మూలమలుపువద్ద బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో రాకేష్ తో పాటు అరవింద్ ల తలలకు, శరీరంలోని ఇతర భాగాలకు గాయాలయ్యాయి. వెనకాల వస్తున్న బంధువులు క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా రాకేష్ మృతి చెందారని వైద్యులు తెలిపారని, మృతుని తల్లి అల్వాల రాజేశ్వరి(47) పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేందర్ తెలిపారు.