శాయంపేట నేటిధాత్రి:
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకునే ఘటన శాయంపేట మండలంలోని పెద్ద కోడెపాక గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పెద్దకోడేపాక గ్రామానికి చెందిన కారంగుల శంకర్ అనే వ్యక్తి వ్యవసాయ పెట్టుబడి, ట్రాక్టర్ కొనుగోలు, చికెన్ షాప్ పెట్టడం కొంత అప్పు చేయడం జరిగింది ఈ అప్పులు తీర్చలేక భార్యతో చెప్పుతూ తరచూ బాధపడు తూ ఉండేవాడు ఈ అప్పులు తీర్చడం ఎలాగో అని మదనప డేవాడు అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెంది ఈ క్రమంలో ఆదివారం రోజున రాత్రి 10 గంటలకు కుటుంబ సభ్యులందరూ కలిసి అన్నం తిని పడుకున్న తర్వాత ఉదయం నాలుగున్నరకు లేచి చూసి వాళ్ళ ఇంట్లో పైకప్పు దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన వ్యక్తి యొక్క భార్య కారంగుల లలిత యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.