
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన వార్డు సభ్యుడు జహంగీర్ తిరిగి సొంతగూటికి చేరాడు. అనుకోని పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆయన అక్కడి విధానాలు నచ్చక తిరిగి బుధవారం బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ నరసింహారావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జడ్పిటిసి మ్యాకల రవి, సెస్ డైరెక్టర్ రేగులపాటి హరి చరణ్ రావుల ఆధ్వర్యంలో పార్టీలో చేరిన ఆయనకు లక్ష్మీనరసింహారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అట్లాగ్గే అనుపురం గ్రామ మాజీ ఎంపిటిసి కాశ నాంపల్లి చల్మెడను మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీనరసింహారావుకే ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరమణ రావు, నాయకులు బూర బాబు తదితరులు పాల్గొన్నారు.