తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దేశగాని కృష్ణ
మరిపెడ/చిన్నగూడూరు నేటి దాత్రి.
కేంద్రప్రభుత్వం తెచ్చిన మహిళ రిజర్వేషన్ బిల్లులో బిసి మహిళలకు సబ్ కోటా కేటాయించాల్సిందేనని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దేశగాని కృష్ణడిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం చిన్న గూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దేశగాని కృష్ణమాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశంలోని మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని తాము స్వాగతిస్తున్నాని అయితే 1996 సంవత్సరంలో పార్లమెంట్ లో వీగిపోయిన బిల్లును ఎటువంటి సవరణలు, మార్పులు చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీలకులకు కోటా కల్పించకుండా యథాతథంగా ప్రవేశపెట్టారని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళా బిల్లులో బిసిమహిళలు సబ్ కోటా కేటాయించకుంటే ఆబిల్లులో సార్ధకత ఉండదన్నారు.