ప్రభుత్వము నిధులు మంజూరు చేసిన పనులు మొదలుపెట్టని కాంట్రాక్టర్
విద్యార్థులకు రక్షణ కరువు పనులు వెంటనే మొదలు పెట్టాలనీ గ్రామస్తుల వేడుకోలు
నిజాంపేట: నేటి ధాత్రి, మార్చి 29
గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ కు దాదాపు 21 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని వాటి పనులను నేటికీ మొదలు పెట్టకపోవడం ఏమిటని గ్రామస్తులు వాపోతున్నారు. హై స్కూల్ కు ప్రహరీ గోడ లేక స్కూల్ లోపలికి పందులు కుక్కలు జంతువులు విపరీతంగా వచ్చి అశుభ్రతకు కారణం అవుతున్నాయి. డైనింగ్ హాలు, కిచెన్, కరెంటు వైర్ ఫిట్టింగ్, ప్రహరి గోడ నిర్మించాలని ప్రభుత్వము 21 లక్షలు కేటాయించడం జరిగిందని ప్రస్తుతము కేవలము కరెంటు ఫిట్టింగ్ మాత్రమే చేయడం జరిగిందని మిగతా పనులు చేయలేదని పలువురు వాపోతున్నారు. విద్యార్థులు మధ్యాహ్న సమయంలో భోజనం చేసే వేళలో జంతువులు ఆటంకాలు కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రహరి గోడ నిర్మించాలని గతంలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని కనీసం నూతనంగా ఏర్పడిన ప్రభుత్వమైన వెంటనే తగు చర్యలు తీసుకొని ప్రహరి గోడ నిర్మించేలా తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు