ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భూపాలపల్లి, జంగేడు కాశీంపల్లిలో జరిగే (వారంతపు అంగడి) సంతలను, పట్టణంలోని బహిరంగ వేళo వేయాలని టీఎస్ ఎమ్మార్పిఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ డిమాండ్ చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంతమంది ప్రజా ప్రతినిధులు , అధికారులు, ఒక గుత్తేదారు ఏకమై ఈ మూడు అంగడిలను, గంప గుత్తగా వేలం వేయకుండా తక్కువ ధరకు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్యని ఆయన దుయ్యబట్టారు. అధికారులు, గుత్తేదారులు ఏకమై తక్కువ ధరకు చేజిక్కుంచుకుంటే, మున్సిపాలిటీ ఆదాయానికి భారీస్థాయిలో గండి పడుతుందన్నారు. తద్వారా మున్సిపాలిటీ ఆర్థికంగా నష్ట పోవాల్సి వస్తుందని, ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న మునిసిపాలిటీ అధికారులు తక్షణమే అంగడీలను బహిరంగ వేలం వేసి, మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేశారు. ఈ మూడు వారాంతపు సంతలను, గంప చీటీని బహిరంగ వేలం వేసినట్లయితే భూపాలపల్లి మున్సిపాలిటీకి వేట రూ. 8 నుండి రూ. 9 లక్షల వరకు ఆదాయం వస్తుంది… కానీ కొంతమంది ప్రజాప్రతినిదులు మరియు మున్సిపాలిటీ అధికారులు కుమ్మక్కయి గంప చీటీని, వారాంతపు సంతలను వేలం వేయకుండా అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు దీని మీద వెంటనే స్పందించి ఈ మూడు సంతలైనా జంగేడు ,కాశీంపల్లి, భూపాలపల్లి వారంతా సంతలను, గంప చీటీలను వెంటనే బహిరంగ వేలం వేసెలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సంతలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పెండేల దేవ రాజ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ జిల్లా కార్యదర్శి బచ్చల చిరంజీవి మాదిగ,భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి శీలపాక హరీష్ మాదిగ, మండల నాయకులు సాంబయ్య మాదిగ లు పాల్గొన్నారు..