ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు కల్లేపెళ్లి సురేష్
ఖానాపూర్ నేటిధాత్రి
ఖానాపురం మండలం రంగాపురం గ్రామంలో దళిత వాడలో దళిత ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఖానాపురం మండల ఇన్చార్జి నేలమారి నాగరాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట్ ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు కల్లెపెల్లి సురేష్ మరియు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ జెర్రిపోతుల వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ కందిక నరేష్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బత్తిని శాంతి కుమార్ మాట్లాడుతూ యావత్ భారతదేశం లో దళిత బంధు ఏ రాష్ట్రంలో లేదని గుర్తు చేశారు. దళితులకి ఇంత గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎల్లప్పుడూ తెలంగాణ దళితులు ఋణపడి ఉంటాము. బిఅర్ఎస్ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటే మేమంతా ఉంటాము. దళితులను ధనవంతులు చేయుటకు దళిత బంధు పథకం ప్రవేశ పెట్టిన కెసిఆర్ కి నర్సంపేటకి మరో 350 యూనిట్లు తీసుకువచ్చిన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పెద్ది సుదర్శన్ రెడ్డికి దళిత జాతి పక్షాన ధన్యవాదాలు తెలుపుకుటున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు సోమరపు రాజశేఖర్, చిన్న పెళ్లి సుధాకర్, కడారి మధుకర్, సదయ్య, కందిక యాకయ్య,సాగర్ మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.