జమ్మికుంట: నేటి ధాత్రి
కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన మండ సురేష్ ( 27) అనే వ్యక్తి ఇల్లందకుంట మండలం మండలం మర్రివాని పల్లి గ్రామ శివారులో తన ద్విచక్ర వాహనంతో కరెంటు పోలును ఢీకొనగా తీవ్ర గాయాల కాగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మండ సురేష్ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపెళ్లి గ్రామంలో గత కొంతకాలంగా కూలి పని చేసుకుంటూ తన భార్య పిల్లలతో ఉంటున్నాడు. కొత్తపల్లి నుండి తన స్వగ్రామమైన కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదంజరిగింది .గమనించిన స్థానికులు 108 కి ఫోన్ చేయగా 108 సిబ్బంది జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు .జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీకాంత్ రెడ్డి ప్రాథమిక చికిత్స నిర్వహించారు పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఏంజియంకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఈనెల 12వ తేదీన తన భార్య కనబడుటలేదని జమ్మికుంట పోలీస్ స్టేషన్లో మండ సురేష్ ఫిర్యాదు చేశారు.