నల్లబెల్లి, నేటి ధాత్రి: క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది వివరాలకు వెళితే మండలంలోని బిల్ నాయక్ తండ గ్రామానికి చెందిన మాలోత్ శివరాం (58) గత కొన్ని రోజులుగా గొంతు క్యాన్సర్ నొప్పితో బాధపడుతూ చికిత్స పొందుతూ ఉండగా ఆదివారం నొప్పి ఎక్కువ కావడంతో భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తుతెలియని క్రిమిసంహారక మందు తాగగా అది గమనించిన చుట్టుపక్కల వారు హుటాహుటిన 108 వాహనంలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ మేరకు మృతుని కుమార్తె బానోతు ప్రేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నైనాల నగేష్ పేర్కొన్నారు.
క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి మృతి.
