https://epaper.netidhatri.com/
`కావ్య గెలుపు నల్లేరు మీద నడకే.
`అన్ని వర్గాల ఆదరణ కావ్యకే.
`మహిళా లోకం మద్దతు కావ్యకే.
`బిఆర్‌ఎస్, బిజేపికి ఇక చుక్కలే.
`వరంగల్ లో బలంగా కాంగ్రెస్.
`అడ్రస్ గల్లంతైన బిఆర్‌ఎస్.
`అంతంతమాత్రంగానే బిజేపి.
`ప్రచారంలో దూసుకుపోతున్న కావ్య.
`మహిళల మంగళహారతుల స్వాగతాలు.
`పల్లెల్లో సంబురంగా ప్రచారం.
`మండుటెండల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్సాహం.
`కావ్య గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణుల సంకల్పం.
`విభేదాలు అభూత కల్పనలు.
`పార్టీ బలంగా వున్నప్పుడే ఇలాంటి ఆరోపణలు.
`ఎన్నికలను కాంగ్రెస్ జారవిడుచుకోదు.
`అధికారంలో వుండి ఏ ఒక్క సీటు వదులుకోదు.
`వరంగల్ లో కారుకు లేదు చోటు.
` ఆ పార్టీ ప్రచారానికే దిక్కులేదు.
`కావ్యకు ఎదురులేదు.
`కావ్య గెలుపుకు తిరుగులేదు.
`కడియం రాజకీయ చాణక్యం…విజయాలన్నీ శ్రీహరి సొంతం.
`సొంతంగా ఎదిగిన నేత ‘‘శ్రీహరి’’.
`మచ్చలేని నాయకత్వం ‘‘శ్రీహరి’’ది.
`‘‘శ్రీహరి నిజాయితీ’’..’’కావ్యకు వరం’’.
`వరంగల్ లో కాంగ్రెస్ గెలుపుకు మార్గం.
`కావ్య గెలుపు వరంగల్ కాంగ్రెస్ సమిష్టి విజయం.
హైదరాబాద్,నేటిధాత్రి:
వరంగల్ పార్లమెంటు అభ్యర్ధి కడియం కావ్య గెలుపు నల్లెరు మీద నడకే అనిపిస్తోంది. ఒక బలమైన నాయకుడి వారసురాలిగా, మానవతా విలువలున్న వైద్యురాలిగా, సామాజిక సేవకురాలిగా కావ్యకు ఎంతో గుర్తింపు వుంది. ఆమె చేసిన సామాజిక సేవ కార్యాక్రమాలతో ఆమెకు ఇప్పటికే ప్రజల్లో ఎంతో పేరుంది. మంచి గుర్తింపు వుంది. అందుకే కావ్య కేంద్రంగానే వరంగల్ పార్లమెంటు ఎన్నికల చర్చ జోరుగా సాగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే కావ్య పేరు తెరమీదకు వచ్చినప్పటి నుంచే ఆమె గెలుపుపై అనేక అంచానాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్‌తో ఆమె గెలుపు ఖాయమైంది. ఎందుకంటే కడియం శ్రీహరికి వున్న పేరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరకీ లేదు. ఉమ్మడి వరంగల్‌రాజకీయాలను కొన్ని దశాబ్ధాల పాటు శాసిస్తున్న నాయకుడు కడియంశ్రీహరి. ఆయనకు ప్రజా సమస్యలు తెలుసు. ప్రజలు ఎదుర్కొనే బాధలు తెలుసు. వాటి పరిష్కారం తెలుసు. వరంగల్ బాగోగులు ఆయనకు మాత్రమే తెలుసు. అందుకే ఆయన కాలాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలలో గుర్తింపు లభించింది. అన్ని పార్టీలలోనూ పెద్ద పీట వరించింది. ఆయన నిస్వార్ధ పూరితమైన ప్రజా సేవ వరంగల్ ప్రజలందరికీ తెలుసు. అందుకే ఆయనకు అంతటి గుర్తింపు. ఆ క్రమంలోనే ఆయన జిల్లా రాజకీయాలనే కాదు, జిల్లా అభివృద్దిలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. కడియం ప్రాతినిధ్యం అంత గొప్పగా సాగింది. ఆయన చేసిన ప్రజా సేవ ఆయన కూతురు కావ్య కూడా పునికి పుచ్చుకున్నది. చిన్న వయసులోనే ఆమె అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేసింది. వైద్యురాలిగా పేదల గుండెల్లో గూడు కట్టుకొని వుంది. ప్రభుత్వ వైద్యం అంటే చాలా మందికి చిన్న చూపు వుండేది. కాని కడియం కావ్య లాంటి వైద్యుల మూలంగా ప్రభుత్వ వైద్యానికి కూడా పేరొచ్చింది. ఉపాధ్యాయుడుగా కడియం శ్రీహరి రేపటి తరాన్ని తీర్చిదిద్దారు. నాయకుడిగా వచ్చే తరానికి బాటలు వేశారు. ప్రజా సేవకుడిగా తన కూతురుకు సామాజిక సేవను, బాధ్యతను నేర్పారు. అందుకే ప్రజలు కావ్యను ప్రచారంలో ఎంతో ఆదరిస్తున్నారు. ఓ వైపు బలమైన కాంగ్రెస్ పార్టీ తోడుగా, నాయకుల అండగా, కుటుంబ నేపధ్యం ఆసరాగా, తండ్రి శ్రీహరి సేవలు బాసటగా అన్ని రకాలుగా కావ్య గెలుపుకు కారణం కానున్నాయి.
వరంగల్ నియోజకవర్గంలో ఎక్కడ విన్నా కావ్య పేరు తప్ప మరొకరి పేరు వినిపించడం లేదు.
ఇతర పార్టీల నేతలకు అంతగా గుర్తింపు లేదు. జిల్లా రాజకీయాల్లో భీష్ముని పాత్రలో వున్న కడియం ఆశీస్సులతోనే చాలా మంది ఎదిగారు. నాయకులయ్యారు. ఆయన ఒక రాజకీయ పాఠశాల. కడియం స్కూలుకు అంత పేరుంది. అంత బలముంది. అదే కావ్యకు వరం కానుంది. అంతే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. ఆరు గ్యారెంటీలతో ప్రజల మన్ననలు పొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌ఎంతో బలంగా వుంది. ప్రజలు కూడా కాంగ్రెస్‌ను ఎంతో ఆదరిస్తున్నారు. ఇప్పటికే అమలౌతున్న ఆరు గ్యారెంటీలు ప్రజల్లో ఎంతో విశ్వాసం నిండి వున్నాయి. తెలంగాణలో ప్రజా పాలన వచ్చిన తర్వత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జవాబుదారి పాలన మన కళ్ల ముందు ఆవిష్కృతమైంది. అందువల్ల ప్రజలు కాంగ్రెస్‌కు పార్లమెంటు ఎన్నికల్లో బ్రహ్మరధం పడుతున్నారు. కావ్య ప్రచారానికి ప్రజలు స్వచ్చందంగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్దఎత్తున కావ్యను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఎక్కడికెళ్లినా మంగళహారతులతో స్వాగతం పలికి దీవిస్తున్నారు. గెలిపిస్తామంటూ మాట ఇస్తున్నారు. కడియం కావ్యకు కాంగ్రెస్ నుంచి టికెట్ ప్రకటించగానే రాజకీయ వాతావరణమంతా ఒక్కసారిగా మారిపోయింది. ఎండాకాలంలో ఉక్కపోత పెరిగినట్లు ఇతర పార్టీలకు ఊపిరి సలపకుండా పోయింది. జిల్లాలోని నాయులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులంతా ఎంతో కష్టపడి కావ్య కోసం పనిచేస్తున్నారు. కావ్య గెలుపు ఇప్పటికే ఖాయమైంది. కాకాపోతే మంచి మెజార్టీ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.
వరంగల్ పార్లమెంటు పరిధిలో కావ్యకు ప్రజల ఆదరణ చూసి ఇతర పార్టీలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
ఎక్కడ చూసినా కావ్య ప్రచారంలో దూసుపోతున్నారు. ఇతర పార్టీలు ప్రచారంలో బాగా వెనుకడి వుండడమే కాదు, కావ్యను ఢీ కొనడం అంత సులువు కాదని చేతులెత్తేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వరంగల్‌లో ఇప్పటికే బిఆర్‌ఎస్ పరిస్ధితి గల్లంతైంది. ఆ పార్టీ మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు కోల్పోయింది. ఆయా స్ధానాలలో కాంగ్రెస్ బలం వెయ్యి రెట్లు పెరిగింది. పదేళ్లుగా ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ ప్రజల్లో నిండిపోయింది. ఇప్పుడు బలమైన నాయకత్వంతో వుంది. వరంగల్‌పార్లమెంటు పరిధిలో వున్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కాంగ్రెస్ చేతిలోనే వున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల ఓట్లు చాలు..కావ్య బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. ప్రజల ఓట్లు తోడైతే రికార్డు మెజార్టీ సొంతం కావడం ఖాయం. అంత గొప్పగా ఆయన విజయం కళ్ల ముందు కనిపిస్తోంది. ఇక బిజేపి పరిస్ధితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరంగల్‌లో బిజేపికి అంత అనుకూలత లేదు. నాయకులు లేరు. కార్యకర్తలు లేరు. జాతీయ పార్టీగా ఎన్నికల్లో తలపడడం తప్ప, గెలుపు కోసం చేసే ప్రయత్నం అన్నది ఆ పార్టీకి కల్ల. వరంగల్‌లో కారు ఎప్పుడో షెడ్డుకు పోయింది. ఇక అది బాగు పడేదిలేదు. కాంగ్రెస్‌ను ఢీ కొట్టే పరిస్దితి లేదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనలో ఎంతో సంతోషంగా వున్నారు. వివాదాలు లేవు. విమర్శలు లేవు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా వున్నారు.
జాతీయ స్దాయిలో కూడ ఈసారి కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు కనిపిస్తోంది.
బిజేపి పదేళ్ల కాలంలో ప్రజలను పీల్చుకుతిన్నది. ధరల మోతతో సామాన్యును నడ్డి విరిచింది. కాంగ్రెస్ పాలనలో రూ.400 వందలున్న సిలిండర్ ధర మూడు రెట్లు పెంచారు. బిజేపి అదికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి దేశానికి చేసిందేమీ లేదు..దేశంలో నిర్మాణమైన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మాణం చేసినవే. దేశానికి అన్నం పెడుతున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పాలనతో కట్టినవే. అంతే కాదు ఉత్తర తెలంగాణకు జీవమైన దేవాదుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది కడియం శ్రీహరే..కావడం విశేషం. దేశంలో సేవా రంగాలలో ప్రజలకు ఎనలేని సేవ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే పదేళ్లుగా బిజేపిని ఆదరించిన ప్రజలు , ఇక బిజేపికి దేశ వ్యాప్తంగా చరమగీతం పాడనున్నారు. మళ్లీ కాంగ్రెస్ వస్తేనే దేశం సస్యశ్యామలమౌతుంది. వైద్యరంగంలో సాగు రంగంలో పురోగమిస్తుంది. దేశానికి అన్నం పెడుతుంది. కాని బిజేపి పెత్తందారులు కొమ్ముకాస్తుంది. పారిశ్రామిక వేత్తలకు అండగా వుంటుంది. సామాన్యులను పీడిరచుకుతింటుంది. ఇవన్నీ అంశాలు కాంగ్రెస్‌కు ఈసారి ఎంతో అనుకూలం కానున్నాయి. అందులో వరంగల్ లో కావ్య గెలుపు బాటలు వేయనున్నాయి.
తండ్రి శ్రీహరి సామాజికసృహను వారసత్వంగా స్వీకరించి కావ్యకు పేద ప్రజలంటే ఎంతో ఇష్టం.
ఆమెకు పేదలంటే ప్రాణం. ఎంతో మందికి ఉచిత వైద్యం అందించింది. ఎంతో మంది పేదలను ఆదుకున్నది. అందులో భాగంగా మానవత్వాన్ని చాటుకున్న కావ్య ఐనవోలు గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన ఇద్దరు పిల్లలను చేరదీసి, వారి ఆలనా పాలనా గత కొన్నేళ్లుగా చూస్తున్న గొప్ప వ్యక్తిత్వం వున్న నాయకురాలు కావ్య. ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. వారికి జీవితాలకు అండగా వున్నారు. ఇలా కావ్య చేసిన అనేక సామాజిక కార్యక్రమాలు ప్రజలకు తెలుసు. అందువల్ల కావ్య ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. ఆశీర్వదిస్తున్నారు. గెలిపిస్తామని మాటిస్తున్నారు. గెలుపు కావ్యదే అని భరోసా ఇస్తున్నారు. ప్రజల స్పందనతో ఇతర పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెతున్నాయి. ఇంత దాక వచ్చిన తర్వాత తమ ప్రచారం కూడా వృధా అని చేతులెత్తేస్తున్నారు. వాళ్లు కూడా కావ్యకు ఎంత మెజార్టీ రావొచ్చో అన్న విషయలను చర్చించుకుంటున్నారు. కావ్య విజయం గురించే మాట్లాడుకుంటున్నారు.