
భద్రాచలం నేటి గాత్రి
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ముఖ్య పరిశీలకులుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి సీఎమ్ఓ సైదులు , యూనిసెఫ్ జిల్లా ప్రతినిధి నిర్మల పాల్గొన్నారు. సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండాలని అప్పుడు మాత్రమే విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయులతో చర్చించడానికి వీలవుతుందని తెలిపారు. సీఎంఓ సైదులు గారు మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొనాలని, విద్యార్థులను గురించి చర్చ జరగాలని కోరడమైనది. యూనిసెఫ్ జిల్లా ప్రతినిధి నిర్మల గారు మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రతను పాటించాలని భోజనానికి ముందు చేతులను ఏ విధంగా కడుక్కోవాలో వివిధ రకాలైన టిప్స్ ను తెలియజేశారు. స్టాఫ్ సెక్రటరీ చిలకమర్రి శ్రీనివాస్ తల్లిదండ్రులందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞను చేయించారు. జిల్లా పరిశీలకులు పాఠశాలలోని మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు