పాల్గొన్న భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం నేటి ధాత్రి
మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఇల్లెందులో సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జీ గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భద్రాచలం తప్ప మిగతా ఆరు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే! ఈరోజు జరుగుతున్న కాంగ్రెస్ సమావేశానికి బిఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరవడంతో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథం పరిసమాప్తం అయ్యింది.