14వ వార్డులో ఇ.వి.ఎం లతో ఇంటింటికి ప్రచారం
పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లో గురువారం రోజున 14వ వార్డు పరిధిలో బిఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గెలపు కోసం ఈ వి ఎం లతో ఇంటింటి ప్రచారం నిర్వ హించారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలో ముచ్చటగా మూడో సారి చల్లా ధర్మారెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరు అన్నారు.అరవై ఏళ్లలో ఇవ్వని హామీలు బిజెపి ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వస్తు న్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్,బిజెపి పార్టీ తెలంగాణలో నాయకులకే భరోసా లేదని ఇక ప్రజల్లోకి ఏ ముఖం పెట్టు కొని వస్తారన్నారు.తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ మూడవసారి కూడా భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రాబో తుందని పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ తోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన అందు తుందన్నారు.పార్టీలక తీతంగా అన్ని వర్గాల సంక్షేమా నికి కృషి చేస్తున్న ప్రభు త్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు.కేవలం ఓట్ల సమయంలోనే ప్రతిపక్షాల నాయకులు కనిపిస్తారని,ఓట్లు అయి పోయాక ఐదేండ్ల వరకు కనిపించకుండా పోయారన్నారు.ఈ కార్యక్రమం లో వార్డు కౌన్సిలర్ ఉమాదేవి రఘుపతి గౌడ్,వార్డు అధ్యక్షులు బండి వెంకటేష్,మైనారిటీ యువ నాయకులు ఎండి అలీ తదితరులు పాల్గొన్నారు.