వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ డాక్టర్లపై జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు . మంగళవారం నాడు అవుట్ పేషంట్ చిట్టి తీసుకొని రూము నెంబర్ 5 లోకి వెళ్లా ను నా ఆరోగ్యం గురించి నా సమస్యను వినకుండా నన్ను అవమానించి దురుసు గా ప్రవర్తించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లు సెక్యూరిటీని పిలిపించి బయటికి పంపడానికి ప్రయత్నించారు . ఈ విషయంపై చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ ప్రిన్సిపల్ హెల్త్ డిపార్ట్ వారికి ఫిర్యాదు చేశాను. వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డాక్టర్లపై విచారణ చేసి ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ల దగ్గర ఫిర్యాదుల బోర్డు ఏర్పాటు చేయించి సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు .డాక్టర్ల పై విచారణ చేసే బాధ్యత నిజాయితీ అధికారులకు అప్పగించాలని వారానికి ఒకసారి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని కోరారు
వనపర్తి లో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లపై ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్
