దేశాయ్ పల్లి, నుంచి విల సాగర్ మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి

*బోయినిపల్లి మండల సిపిఎం పార్టీ శాఖ డిమాండ్

బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దేశాయిపల్లి, విలాసాగరు వెళ్లే రహదారి మధ్యలో కల్వట్టు పైనుంచి విలాసాగర్ గ్రామానికి వెళ్లాలంటే రోడ్డు పూర్తిగా డామేజ్ అయింది కాబట్టి ఇక్కడున్న వ్యవసాయదారులు, అలాగే విలాసాగర్ కు వెళ్లే స్టేట్ బ్యాంకు ఖాతాదారులు ఈ రహదారి వెంబడి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షా బావ నేపథ్యంలో ఈ రోడ్డు పూర్తిగా చెడిపోయింది కాబట్టి, ఈ కల్వర్టు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ రెండు ఊర్ల మధ్యలో ఉన్న ఈ బ్రిడ్జి కలవర్టు వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది కాబట్టి, శాశ్వతంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!