
పర్వతగిరి నేటి ధాత్రి
వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం, సోమవారం గ్రామానికి చెందిన జానపద కళాకారుడు ఆకుల పెళ్లి కరుణాకర్ అనారోగ్య కారణంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న విషయం తెలుసుకొని చైతన్య కళాబృందం అతనికి అండగా నిలబడింది. చైతన్య కళాబృందం అధ్యక్షులు వల్లందాస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో 7000 రూపాయలు ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు కందిక సుధాకర్, ఇజ్జగిరి గణేష్, బరిగల వెంకన్న, గొలుసుల రంజిత్, డప్పు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.