
నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన తరుణంలో సర్పంచులుగా గ్రామ పంచాయితీలలో కొలువుదీరిన పాలకవర్గం పదవీకాలం జనవరి 31 తో ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన మొదలు పెట్టింది ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం.కాగా గత ఐదు సంవత్సరాలుగా గ్రామ పంచాయితీ పరిధిలోని గ్రామాల్లో సేవలు అందించిన సర్పంచులు,ఉప సర్పంచులు,వార్డు సభ్యులకు ఆయా గ్రామ పంచాయితీ కార్యాలయాలలో పంచాయితీ కార్యదర్శులు సన్మాన కార్యక్రమాలు చేపట్టారు.ఈ క్రమంలోనే నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో కార్యదర్శి శ్రావణ కుమారి అధ్యక్షతన పాలకవర్గ సభ్యులకు ఘన సన్మానం జరిగింది.ముఖ్య అతిథిగా ఎంపిటిసి పెద్ది శ్రీనివాస్ రెడ్డి హాజరైయ్యారు.కాగా సర్పంచ్ బరిగెల లావణ్య కిషోర్,ఉప సర్పంచ్ బాషబోయిన శ్రీను లతో పాటు వార్డు సభ్యులు ఉప్పుల రాజు,బాషబోయిన జమున శ్రీనివాస్,అజ్మీర రజితవస్రం,వాంకుడోతు సోని,
వీరమల్ల కవిత చంద్రశేఖర్,కో ఆప్షన్ సభ్యుడు సుంకరి సాంబరెడ్డిలతో శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం గత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సర్పంచ్ లావణ్య కిషోర్ ఉప సర్పంచ్ శ్రీను మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేశామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మల్టీపర్పస్ సభ్యులు బాషబోయిన సుధాకర్,ఇప్ప ఎల్లయ్య,యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.