Phule Jayanti Observed in Munagala Village
జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఘన నివాళి. సర్పంచ్ వేమూరి సత్యనారాయణ.
మునగాల, నేటి ధాత్రి :
మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను శనివారం మండల పరిధిలోని నరసింహాపురం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ వేమూరి సత్యనారాయణ పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ. జ్యోతిరావు పూలే అనగారిన వర్గాల కోసం మహిళ విద్య కోసం చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆచరించాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రెడ్డబోయిన ప్రశాంత్, వార్డ్ సభ్యులు. షేక్ అజీజ్ మియా, గ్రామ పెద్దలు బొమ్మ చిన్న వెంకన్న, కారంగుల సైదులు, దళిత నాయకులు రేవూరి బాబు మీసాల రామ్మూర్తి, గ్రామస్తులు చెర్వుపల్లి శ్రీను, వీరబోయిన వీరాస్వామి, నారయ్య, బొమ్మ అంజయ్య, శ్రీను గుండు కరుణాకర్, రామస్వామి వెంకీ, విజయ్, వెంకటేశ్వర్లు రామయ్య, నాగయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.
