
Telangana
తెలంగాణ జాతిపితకు ఘన నివాళి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ నేత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో స్థానిక ఎమ్మార్వో ముప్పు కృష్ణ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ప్రముఖ భూమిక పాత్ర పోషించిన ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ కార్తీక్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.