ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసిపి కిరణ్ కుమార్
#నెక్కొండ , నేటి ధాత్రి: వేసవికాలం వచ్చిందంటే దొంగతనాలతో పల్లెలు పడలెత్తిపోతుంటాయి. ఈ వేసవి కాలంలో మాత్రం నెక్కొండ మండలంలో భారీ ఎత్తున చోరీ జరగడం మండల వ్యాప్తంగా ప్రజలను కంటిమీద కులుకు లేకుండా చేస్తుంది. వివరాల్లోకి వెళితే నెక్కొండ మండలం అప్పలరావుపేట గ్రామానికి చెందిన తిప్పని ప్రమీల భర్త వీరభద్రయ్య ప్రతిరోజు జాతీయ ఉపాధి హామీ పనులకు వెళుతుంటారు అదేవిధంగా రోజువారీగా ఉపాధి హామీ పనులకు గురువారం రోజు కూడా పనులకు వెళ్లిన ప్రమీల భద్రయ్యలు తిరిగి ఇంటికి చేరుకోగానే ఒక సైడ్ తలుపు లేపి అనుమానాస్పదంగా కనిపించడంతో లబోదిబోమంటూ నెక్కొండ ఎస్సై మహేందర్ కు సమాచారం చేరవేశారు వెంటనే స్పందించిన ఎస్సై మహేందర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించగా బీరువాలోని ఆరు తులాల బంగారం 60 వేల రెండు వందల రూపాయల నగదు తో కలిపి మొత్తం మూడు లక్షల 200 రూపాయలు దొంగలించినట్టుగా ప్రమీల వీరభద్రయ్యలు ఎస్సై మహేందర్ కు తెలిపారు. ఇట్టి విషయంపై ప్రమీల వీరభద్రయ్యల నుంచి దరఖాస్తు స్వీకరించి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టుగా ఎస్సై మహేందర్ తెలిపారు.
@. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎసిపి కిరణ్ కుమార్
అప్పలరావుపేటలో తాళం
వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటనను నర్సంపేట ఏసిపి పరిశీలించారు అనంతరం ఎసిపి మాట్లాడుతూ గ్రామాలలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వేసవికాలం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఏసీపి కిరణ్ కుమార్ తోపాటు సిఐ చంద్రమోహన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.