
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం,
ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవం వేడుకలు
గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం మరియు ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డా”బండ ప్రకాష్ ముదిరాజ్ ఆదేశాల మేరకు గణపురం మండల ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు బోయిని సాంబయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా డైరెక్టర్ చాడ కృష్ణస్వామి ముదిరాజ్ పాల్గొని జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దపీట వెయ్యాలని వారి సంక్షేమానికి ప్రత్యేక కృషి అందించాలని అన్నారు. ప్రభుత్వం పీఎంఎంఎస్ వై చిన్న అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించాలని అన్నారు. బిసి డి నుండి బీసీలు కి ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించారు కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన మార్చడం లేదని త్వరగా మార్చే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ చైర్మన్ లు కట్ల మల్లయ్య,ఈడ బోయిన వెంకన్న,మత్స్యశాఖ సొసైటీ కార్యదర్శి కొంతం గణపతి,డైరెక్టర్ గుళ్ళ రాజకుమార్,నాయకులు పల్లెబోయిన చిన్న రాజయ్య,మామిడి చిరంజీవి, పరుషవెని రాజయ్య,దామ చేరాలు,అల్లం రవీందర్,బోళ్ల సదానందం,మండల యూత్ అధ్యక్షులు పెండ్యాల వెంకటేష్ ముదిరాజ్,పల్లెబోయిన రవీందర్,మద్దెల అశోక్,బోళ్ల బాలకృష్ణ,ఆకుల శ్రీను,తేలు రామచందర్,మాల వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.