బదిలీపై వెళుతున్న సిఐ కు ఘనంగా వీడ్కోలు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లోని ఎస్ వికే ఫంక్షన్ హాల్లో బదిలీపై వెళుతున్న సీఐ రంజిత్ రావుకు ఘనంగా వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఎన్నో కేసులను ఫలితం రాబట్టి, సునాయాసంగా చేదించి, ప్రజలను మంచి మార్గంలో పెట్టిన ఘనుడు అని పలి కారు.కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అంద జేశారు. సీఐ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేసే కర్తవ్యం చేసి, దానికి నాయకులందరూ సహక రించారని అన్నారు. మండల కేంద్రంలోని జర్నలిస్టులందరూ శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై పర మేష్ , అన్ని గ్రామాల నాయ కులు, కార్యకర్తలు సర్పం చులు ,మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, పోలీ సులు పాల్గొన్నారు.
