వేములవాడ రూరల్ నేటి దాత్రి
మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలుగుతాడు
ప్రజలందరి కళ్ళలో ఆనందం చూడలన్నదే చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థల ప్రధాన లక్ష్యమని చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థల ఛైర్మన్ చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు. వేములవాడ మండలం నుకలమర్రి గ్రామంలో జిల్లా వికాస తరంగిణి, చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థలు కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మీ నరసింహా రావుతో పాటు ఎంపిపి బండ మల్లేశం సర్పంచ్ పెండ్యాల తిరుపతి సెస్ డైరెక్టర్ దేవరాజం సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు ఎస తిరుపతి,మండల అధ్యక్షుడు గోస్కుల రవి ఏ ఎం సి డైరెక్టర్ శంకర్ నాయకులు ఇరియ నాయక్ పరశరములు అంజయ్య హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చల్మెడ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోగాల బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుందని, గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. 30ఏండ్లు పై బడిన వారు ఏడాదికి ఒకసారి రక్త, మూత్ర పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు