
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక డాక్టర్ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చర్ల లో హిందీ విభాగము ఆధ్వర్యంలో ప్రసిద్ధ హిందీ కవి మరియు సంఘసంస్కర్త సంత్ రవిదాస్(1370- 1518 ) సాహిత్యం పై విద్యార్థులకు చర్చ గోష్టి నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి కళాశాల ఉప ప్రధానాచార్యులు శ్రీనివాసులు గారు విచ్చేసి సంత్ రవిదాస్ చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు . ఆ తర్వాత మాట్లాడుతూ సంత్ రవిదాస్ మధ్యయుగములో కబీర్ దాసు లాగే సామాజిక అసమాన తలను రూపుమాపడానికై ఎనలేని కృషి చేశారని, ఆయన రచనలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరమైనవని కాబట్టి విద్యార్థులు రవిదాస్ సాహిత్యముపై అవగాహన పెంచుకోవాల్సింది ఉన్నదని తెలిపారు .
హిందీ విభాగ అధ్యక్షులు డాక్టర్ నరసింహారావు కళ్యాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను మధ్యయుగము నాటి హిందీ కవుల సాహిత్యముపై అవగాహన కల్పించుట కొరకు సంత్ రవిదాస్ సాహిత్యం గురించి చర్చాగోష్టి కార్యక్రమము నిర్వహించడం జరుగుతున్నదని చెబుతూ సంత్ రవిదాస్ మధ్యయుగంలో భారతదేశం సామాజిక సాంస్కృతిక ఐక్యతకు ఎనలేని కృషిచేసిన కవులలో ఒకరని ఆయన రచనలు మిగతా భాషలలో అనువదించబడినయని ఈయన రాసిన కొన్ని పద్యాలు లో కూడా సిక్కుల పవిత్ర గ్రంథం అయినటువంటి గురు గ్రంథ సాహెబ్ లో కూడా చేర్చబడినవి అని చెబుతూ హిందీనిర్గుణ భక్తి సాహిత్యము లో రవిదాసు-సాహిత్యము మరియు రైదాసు వాణి ప్రాధాన్యత చాలా ఉన్నది. ఈయన ముఖ్యంగా కులమతాలకతీతంగా సమాజ నిర్మాణం చెయడం మరియు పరోపకార భావనలను మనిషిలో నాటుకుపోయేటట్టు చేసి రచనల ద్వారా ప్రజలను ప్రేరేపించినారు .
ఈ కార్యక్రమంలో క కళాశాల విద్యార్థులు జస్విందర్ సింగ్ ,అర్షియా ఫాతిమా , మొహమ్మద్ సమీర్ సంత్ రవిదాస్ జీవితము మరియు సాహిత్యము గురించి తమతమ అభిప్రాయాలను తెలియజేసినారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.