ముగ్గురు వ్యక్తుల పై రాడ్ తో దాడి చేసిన కౌన్సిలర్

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

ప్రభుత్వ భూమిలో అక్రమంగా బోరు వేస్తున్నారని ప్రశ్నించినందుకు ముగ్గురు వ్యక్తుల పై విచక్షణ కోల్పోయి దాడి చేసిన కౌన్సిలర్ తీరు పై పలు విమర్షలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సిలర్ దాడికి గల కారణాల పై పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లికి చెందిన 3వ వార్డ్ కౌన్సిలర్ మేడిపల్లి రవిందర్ రామన్నపల్లి పాఠశాల సమీపంలోని సర్వే నెంబర్ 422 లోని ప్రభుత్వ భూమిని అక్రమించుకొని బోరు వేస్తున్న విషయమై కొలకాని. రాజు, మర్రి. మల్లయ్య, మేడిపల్లి, రమేష్ లు వెల్లి… ఇది ప్రభుత్వ భూమిలో బోరు వేస్తున్నావని చెప్పి ప్రశ్నించి స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ విషయం తెలుసుకున్న రిపోర్టర్లు, ఆ సంఘటన స్థలానికి చెరుకొని అక్కడ సంఘటన పరిశీలిస్తున్న సమయంలో.. బాధితుడు భూమిని ఆక్రమించుకున్నట్లు కౌన్సిలర్ మేడిపల్లి రవిందర్ తన వద్ద ఉన్న ఆధారాలను చూపించాడు… ఆ సందర్భంలో అతని పేరు పై అట్టి భూమి లేనప్పడికి.. ఇది తనకు వేరేవారు అమ్మారని దబాయిస్తుండడంతో అక్కడే ఉన్న ఫిర్యాదు చేసినటువంటి ముగ్గురు వ్యక్తులు మీడియాతో అసలు జరిగిన విషయాన్ని చెబుతుండగా… కోపోధ్రేక్తుడైన కౌన్సిలర్ రవిందర్ బోరు వెస్తున్న స్థలంలో ఉన్నటువంటి రాడ్ తో విచక్షణ రహితంగా ముగ్గురి పై దాడి చేయడంతో మర్రి మల్లయ్య తలకు తీవ్ర గాయం కాగా… రాజుకు తలపై స్వల్ప గామాలయ్యాయి. ఇంకొక మేడిపల్లి రమేష్ చేతులకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన వారు పోలీస్ స్టేషన్ కి వెల్లి ఫిర్యాదు చేయగానే.. వారు హస్పటల్ చికిత్స నిమిత్తం హస్పటల్ కి పంపించారు. తీవ్రంగా గాయపడ్డ మల్లయ్యను స్థానికంగా పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటి హోస్పటల్ లో చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఇట్టి విషయం పై పోలిసులు క్షేత్రస్థాయిలో విచారణ చెపట్టి భాధితుడి భార్య మర్రి రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి నింధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి తెలిపారు. విషయం తెలియగానే నిందితుడు మేడిపల్లి రవిందర్ ను అరెస్టు చేసిండ్రు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మర్రి మల్లయ్యను పరమర్శించి. ఆ సంఘటనకు గల కారణాలను పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకున్నరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరాచకాలకు హద్దు-ఆదుపు లేకుండ పోతుందని అన్నారు. సంఘటన పై సిపికి ఫిర్యాదు చేశామని. నిందితుని పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *