స్థానిక సమస్యలపై పర్యటించిన కార్పొరేటర్.
వాటర్ సరఫరా విషయంలో సమస్యలు తెలియచేయాలి.
స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్
నేటిధాత్రి, కాశిబుగ్గ
వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ కాలనీకు సంబంధించిన శానిటేషన్ మరియు వాటర్ సరఫరా సమస్యలపై స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ కీర్తి నగర్ లో పర్యటించడం జరిగింది.మున్సిపల్ వాటర్ మెన్ మరియు మున్సిపల్ శానిటరీ జవాన్ లకు పలు సూచనలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని వాటర్ సప్లయ్ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ముందస్తుగా తెలియజేయాలని కోరారు. ముందస్తు సమాచారం ఇవ్వడం వల్ల సమస్య తొందరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని అన్నారు.అనంతరం కాలనీ లో ఏపుగా పెరిగిన తుమ్మ చెట్లు మరియు పిచ్చి చెట్లను జెసిబి సహాయంతో తొలగించే పనులను పరిశీలించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.