
వనపర్తి నెటిదాత్రి:
ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలన పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నుండి ఆర్డీవో కార్యాలయం అవరణలో గల ఇవియం గోదాం లో ఈవీఎంల ఫస్ట్ లెవెల్ తనిఖీ ఎఫ్ఎల్సీ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి పరిశీలించారు.
ఈసీఐఎల్ అధికారుల ఆధ్వర్యంలో నేటి నుంచి ఈవియం ల మొదటి స్థాయి పరిశీలన జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా చెకింగ్ పూర్తయ్యాక ర్యాండం ఈవీఎంల మాక్ పోలింగ్ సైతం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గుర్తింపు లేని వ్యక్తుల్ని ఎఫ్ఎల్సీ నిర్వహిస్తున్న కేంద్రంలోకి అనుమతించవద్దని కలెక్టర్ అధికారులకు సూచించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ఈవీఎంలను భద్రపరిచిన గోదాంను వివిధ పార్టీల ప్రజాప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. కలెక్టరేట్ లో ఉన్న ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను కూడా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీవో పద్మావతి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ నుంచి వేణాచారి, బీఆర్ఎస్ నుంచి సయ్యద్ జమీల్, బీఎస్పీ నుంచి వంశీ కృష్ణ, సీపీఎం నుంచి పరమేశ్వరాచారి, సీపీఐ నుంచి రమేష్, ఇండిపెండెట్లు తదితరులు పాల్గొన్నారు.