జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన పాగాల తిరుపతి అనే లారీ డ్రైవర్ గత నెల అనారోగ్యం కారణంగా హఠాత్తుగా చనిపోవడం జరిగింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అతని కుటుంబాన్ని చూసి చలించి పోయిన తోటి డ్రైవర్స్ మంచిర్యాల లారీ సెక్యూర్ డ్రైవర్స్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క సభ్యులు తమ వంతు సహాయంగా 40,000 రూపాయలు మరియు ఒక నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ యొక్క చైర్మన్-కస్తూరి రాములు, ప్రెసిడెంట్-ఇంద్రాల రాజు,జనరల్ సెక్రెటరీ-జక్కుల మహేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్-ఠాగూర్ రఘు సింగ్,క్యాషియర్-మహమ్మద్ అశ్రాఫ్ అలీ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ జుబేద్ అహ్మద్ పాల్గొనడం జరిగింది.