తాటిచెట్లు నరికినవారిపై కేసు నమోదు చేయాలి.

# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్.

# ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డికి మోకుదెబ్బ ఆధ్వర్యంలో పిర్యాదు.

నర్సంపేట,నేటిధాత్రి :

దుగ్గొండి మండలం పొనకల్ గ్రామంలో తాటిచెట్లు అక్రమంగా నరికిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ మేరకు నర్సంపేట ఆబ్కారి సిఐ. నరేష్ రెడ్డికి మోకుదెబ్బ ఆధ్వర్యంలో గురువారం పిర్యాదు చేశారు. అనంతరం రమేష్ గౌడ్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల కులాలలో గౌడ కులస్తుల వృత్తి అత్యంత ప్రమాదకరమైనదన్నారు.నిరంతరం చస్తూ బతుకుతున్న గౌడ్ వృత్తి సంబంధమైన తాటి, ఈత చెట్లను అభివృద్ధి పేరుతో, రోడ్డు వెడల్పు, చెరువు కట్టల మరమ్మత్తుతో విచ్చల విడిగా నరికి వేస్తున్నారని ఆరోపించారు.దీనికి తోడు గ్రామీణ ప్రాంతంలో ఇష్టారాజ్యాంగ ప్రభుత్వం బెల్టు షాపులకు అనుమతులు ఇవ్వడం వల్ల గౌడ్ లకు కల్లు అమ్ముకునే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పాలకుల స్వార్థపూరిత ఆలోచన వల్ల కల్లుగీత పరిశ్రమ ఉనికి లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల సమయంలోనే పాలకులకు గౌడ కులస్తులు గుర్తుకు వస్తారని, అనంతరం మరచిపోతున్నారన్నారు.తాటిచెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేనిచో పెద్ద ఎత్తున గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని రమేష్ గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గంప రాజేశ్వర్ గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జూలూరి హరిప్రసాద్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గండి గిరి గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు గుండెబోయిన కోటి గౌడ్ , దుగ్గొండి మండలం అధ్యక్షులు తడుక కొమురయ్య గౌడ్, ఉపాధ్యక్షులు గుండెబోయిన రమేష్ గౌడ్,ఎంపిటీసీ బండి జగన్నాదం గౌడ్,గౌడ సంఘం సీనియర్ నాయకులు బొమ్మగాని సదానందం గౌడ్, పొనకల్ గౌడ సంఘం అధ్యక్షులు పిల్లల సురేష్ గౌడ్, ఉపాధ్యక్షులు బండి రాజయ్య గౌడ్, బొట్టు పెద్ద మనిషి బొమ్మగాని రవీందర్ గౌడ్,బొమ్మగాని రాజయ్య గౌడ్ మాజీ అధ్యక్షులు,కార్యదర్శి బొమ్మగాని సుధాకర్ గౌడ్, డైరెక్టర్ లు గాజర్ల బుచ్చయ్య గౌడ్,బురగాని సుమన్ గౌడ్, బొమ్మగాని సారంగపాణి గౌడ్, బండి గావాస్కర్ గౌడ్, మడిపెల్లి వినయ్ గౌడ్, ముత్యాల వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!