
సీఐ వేణు చందర్.
చిట్యాల, నేటి దాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తేదీ: 04.11.2023 రోజున గుంటూర్ పల్లి గ్రామానికి చెందిన కొంక శ్రీనివాస్ రావు, అనునతడు తన జామయిల్ తోటకు నీళ్ళు పెట్టి వస్తానని వెళ్ళి తిరిగి రానందున తన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ధరఖాస్తు ఇవ్వగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా తేదీ: 06.11.2023 రోజున గుంటూర్ పల్లి గ్రామ శివారులోని మన్నెం సీతయ్య పత్తి చేను వద్ద కొంక శ్రీనివాస్ రావు మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో పడి ఉండగా శవపంచనామా నిర్వహించి తదుపరి దర్యాప్తు లో భాగంగా కోటపాటి సాంబశివ రావు అనునతాడు తన వరిపోలంకి అడవి పందుల నుండి రక్షణకు ఏర్పాటు చేసిన బైండింగ్ వైర్ తో కట్టెలకు చుట్టి అట్టి బైండింగ్ వైర్ లకు కరెంట్ సప్లయ్ ఇవ్వగా కాలకృత్యాల కోసం అటు వైపు వెళ్ళిన కొంక శ్రీనివాస రావు అనునతను కోటపాటి సాంబశివ రావు పెట్టిన అట్టి కరెంట్ సప్లయ్ గల బైండింగ్ వైరలను తాకి అక్కడే మృతి చెందగా, తరువాత అట్టి శవాన్నిచూసిన కోటపాటి సాంబశివ రావు తన మీద కేసు అవుతుందనే భయం తో అట్టి శవాన్ని ఎవరు చూడకుండా తీసుకెళ్ళి మన్నెం సీతయ్య పత్తి చేను లో పడేసినాడు. ఇట్టి నేరాన్ని నేరస్థుడు ఒప్పకోగా అతడి నుండి తాను దాచి పెట్టిన బైండింగ్ వైర్, సర్వీసు వైర్ మరియు మృతుడికి సంబంధించిన బకెట్ మరియు చెప్పులు అతడి పొలం లో స్వాదీనం చేసుకొని నేరస్తుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించనైనది అని చిట్యాల సిఐ వేణు చందర్*గారు తెలిపారు వారితో పాటుఎస్ ఐ జె.రమేష్*, హెడ్ కానిస్టేబుల్ సురేందర్ మరియు కానిస్టేబుల్ రంజిత్ లు ఉన్నారు.
చిట్యాల పోలీస్ వారి హెచ్చరిక
ఇటీవల మండల పరిది లోని కొంత మంది రైతులు తమ పొలాల చుట్టూ అడవి పందుల నుండి రక్షణ కొరకు బైండింగ్ వైరు పెట్టి కరెంట్ సప్లయ్ ఇస్తున్నట్టు పోలీస్ వారి దృష్టికి వచ్చింది. పోలీసు వారు అటువంటివారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇటువంటి చర్యల వలన మనుషుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కనుక వాటిని వెంటనే తొలగించకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి అని చిట్యాల సిఐ వేణు చందర్ గారు మరియు చిట్యాల ఎస్ ఐ జె. రమేష్* గారు హెచ్చరించారు.