
Farmer Insurance.
రైతు బీమా దరఖాస్తుల ఆహ్వానం…
జహీరాబాద్ నేటి ధాత్రి:
రైతు భీమా పథకం 2025 ఝరాసంగం మండల కేంద్రంలోని అన్ని రైతువేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు బీమా దరఖాస్తు స్వీకరణ చేపట్టడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ ఒక ప్రకటన తెలిపారు.
◆ 05-06-2025 నాటికి భూభారతి పోర్టల్లో డిజిటల్ సైన్ చేసిన పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతు అర్హులు
◆ 18 నుండి 59 సంవత్స రాల వయస్సు (పుట్టిన తేదీ 14-08-1966 నుండి 14-08-2007 వరకు, రెండు తేదీలు కలుపుకొని) ఉన్న వారు మాత్రమే అర్హులు.
◆సంబంధిత రైతే స్వయంగా వచ్చి రైతు వేదికలో దరఖాస్తు అందజేయాలి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఎటువంటి దరఖాస్తు స్వీకరించబడదు.
◆ చివరి తేదీ – 12.08.2025
◆ జతచేయవలసిన పత్రాలు
◆ దరఖాస్తు ఫారం
◆ రైతు ఆధార్ కార్డు జిరాక్స్
◆ రైతు భూమి పాస్ పుస్తకం జిరాక్స్
◆ నామినీ ఆధార్ కార్డు జిరాక్స్
సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తులను ఇవ్వాలని సూచించడం జరిగింది..