
Medical and Health Department
రేడియోగ్రాఫర్ కృష్ణను సన్మానించిన డిఎంహెచ్ఓ అప్పయ్య
కృష్ణను అభినందించింన ఆసుపత్రి సిబ్బంది
పరకాల నేటిధాత్రి
17,18,19 తేదీలలో జరిగిన టిబి ముక్త్ భారత్ ప్రోగ్రాం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు జిల్లా క్షయ నివారణశాఖ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా దగ్గు,జ్వరంతో బాధపడుతున్న రోగులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ అధిక మొత్తంలో ఎక్స్రేలు తీసినందున పరకాల ప్రభుత్వ రేడియోగ్రాఫర్ గాను రాసమల్ల కృష్ణని అభిందించి డిఎంహెచ్ఓ అప్పయ్య,డిస్టిక్ టిబి కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్.హిమబిందు,డిసిహెచ్ గౌతమ్ చౌహాన్,ఆర్ఎంఓ బాలకృష్ణ లు శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్బంగా డిఎంహెచ్వో అప్పయ్య మాట్లాడుతూ ఇలానే పేద ప్రజలకోసం నిరంతరం పనిచేస్తూ ఉండాలని,ఇలాంటి సేవలు పరకాల పరిసర ప్రాంత ప్రజలకు అనునిత్యం అందించాలని అన్నారు.