
Seasonal Diseases.
వైద్య ఆరోగ్య, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి,
ప్రత్యేక అధికారులు హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,
జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల,తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,
మరిపెడ నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వానకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అని నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు,
క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, మాత శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నటువంటి సబ్ సెంటర్ ల వారిగా సిబ్బంది షెడ్యూల్ ప్రకారం వైద్య సేవలు అందించాలన్నారు,
ఆస్పత్రిలోని ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వివరాలను మందుల స్టోర్ గదిని, పరిసరాలను పరిశీలించి చికిత్స పొందుతున్న సిబ్బందితో అందుతున్న సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు,ఉపాద్యాయులు విద్యార్థుల యొక్క చదువు పై ప్రత్యేక దృష్టి సారించి శ్రద్ధతో సబ్జెక్టుల వారిగా అర్థమయ్యే రీతిలో విద్యాబోధనలో అందించాలని సూచించారు,విద్యార్థులతో మాట్లాడి వారి ప్రతిభా సమర్థ్యాలను తెలుసుకున్నారు,ఉపాద్యాయులు సిలబస్ ను షెడ్యుల్ వారిగా పూర్తి చేసి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని అన్నారు. అవసరమైన పరిక్షలు నిర్ణీత సమయంలో నిర్వహించి వారి లోని సృజనాత్మకతను వెలికి తీయాలని అన్నారు,
వంటశాలను, స్టోర్ గది ని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని, వేడి వేడిగా పరిశుభ్రమమైన భోజనాన్ని అందించాలని అన్నారు. స్టోర్ గదిని పరిశీలించి విద్యార్థులకు స్వచ్చమైన కూరగాలతో భోజనం సిద్ధం చేసి పిల్లలకు అందించాలని సూచించారు,
అనంతరం తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను, సిబ్బంది హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు,
ప్రజలకు సర్టిఫికెట్లు ఇతర సేవలకు సంబంధించి సత్వరంగా వేగంగా సేవలు అందించాలని,తాసిల్దార్ కృష్ణవేణికి సూచించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, తాసిల్దార్ కృష్ణవేణి,వైద్యాధికారి డాక్టర్ రవి, ఆర్ఐ శరత్ చంద్ర గౌడ్, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.