జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు…
బెల్లంపల్లి ఏసిపి రవికుమార్
గంటల వ్యవధిలో దొంగను చేదించిన పోలీసులు…
పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం తో 10 గంటల్లో దొంగతనం కేసు చెందించి దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గోదావరి ఖని కి చెందిన ఇమాన్యూల్ అనే యువకుడు జల్సా లకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రామకృష్ణపూర్ పట్టణం లోని హనుమాన్ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో కిటికీ ప్రక్కన నిద్రిస్తున్న మహిళ మేడలో నుండి మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడు, ఎదురు ఇంటిలో కిటికీ ప్రక్కన పెట్టిన మొబైల్ ఫోన్ లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితులు పిర్యాదు చేయగా సి.సి కెమెరాలను పరిశీలించి ఇమాన్యూల్ నేరాలకు పాల్పడ్డాడని నిర్ధారిరించుకొని పొలుసులు మూడు బృందాలుగా ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశం లో మందమర్రి సి.ఐ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్.ఐ రాజ శేఖర్, కాసిపేట ఎస్. ఐ ప్రవీణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్రైమ్ టీమ్ సిబ్బంది జంగు, రాకేష్, మహేష్ ,వెంకటేష్, సిసిఎస్ సిబ్బంది సతీష్ శ్రీనివాస్ లను ఏసిపి అభినందించి రివార్డులను అందజేశారు.