రజితోత్సవ సభను విజయవంతం చేయండి
– పోస్టర్ ఆవిష్కరణ
– టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి
సిరిసిల్ల (నేటి ధాత్రి):
బిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరిగే పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయడానికి సిరిసిల్ల తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించంకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ 27వ తేదీన జరిగే పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యధికంగా హాజరుకావాలని కోరడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ,మ్యాన రవి, ఎండి సత్తార్, బొల్లి రామ్మోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, టిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.