ప్రజాసేవకే కాకా కుటుంబం… ప్రజల కొరకే కాకా కుటుంబం..
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
రైల్వే బ్రిడ్జికి పునాది వేశాం… ప్రారంభించాం..!
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
సన్నబియ్యం అక్రమ దందా చేస్తే కేసులు నమోదు చేస్తాం.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి
క్యాతనపల్లి వద్ద రైల్వేగేటుపై నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జికి పునాది వేసింది మేమే ప్రారంభించింది మేమేనని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంగళవారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజాసేవకే కాకా కుటుంబం అని ప్రజల కొరకే కాక కుటుంబం అని అన్నారు.

రామకృష్ణాపూర్ పట్టణ ప్రజల చిరకాల కోరిక రైల్వే బ్రిడ్జి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, గతంలో కాంగ్రెస్ హయాంలో పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలో బ్రిడ్జి పునాది వేశామని, తిరిగి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యేలుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం త్వరితగతిన పూర్తిచేసి బ్రిడ్జి ప్రారంభించామని తెలిపారు.ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ప్రజాసేవకే కాక కుటుంబం ఉందని అన్నారు. గత ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం తోనే సరిపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ..

రైల్వే గేటు పడిన సమయంలో అనేక ప్రాణాలు పోయాయని, ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రాంత ప్రజల కష్టాలు తీరుతున్నాయని అన్నారు. పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, సన్న బియ్యపు అక్రమ దందా చేస్తే కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీలోని అన్ని ఏరియాలకు త్వరలోనే మంచినీరు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు, మాజీ చైర్ పర్సన్ జంగం కళ,మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి నాయకులు రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకుబ్ ఆలీ, గోపతి భానేష్, పాల రాజు,మహంకాళి శ్రీనివాస్,కుర్మ సురేందర్, సిపిఐ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.