బాలాజీ టెక్నో స్కూల్లో ఉగాది సంబరాలు
నర్సంపేట,నేటిధాత్రి:
శ్రీ క్రోధినామ సంవత్సరానికి వీడుకోలు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ నూతన సంవత్సరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు,సిబ్బంది అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ
నర్సంపేట మండలంలోని లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో ఉగాది సంబరాలు వైభవంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు. లక్నెపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలుగు కాలమానం ప్రకారం 60 సంవత్సరాల క్యాలెండర్ ఉంటుందని అందులో ఈ విశ్వావసు నామ సంవత్సరం 39వ సంవత్సరమని అన్నారు. ఉగాది సందర్భంగా ప్రతి తెలుగు వారు షడృచులతో పచ్చడి తయారు చేస్తారు. భక్ష్యాలు అనే ప్రత్యేక పిండివంటలు తయారుచేసి కుటుంబ సభ్యులందరూ కలిసి తీసుకోవడం తెలుగు వారి ఆనవాయితి అని,ప్రతి పండుగను కుటుంబ సమేతంగా జరుపుకునే గొప్ప సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టెక్నో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.