సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
కల్వకుర్తి /నేటి ధాత్రి.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో రూ. 45 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయి. కల్వకుర్తి పట్టణంలో శనివారం మహబూబ్ నగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజానర్సింహా, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ లు బృంగి ఆనంద్ కుమార్,యెన్నం భూపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు జిల్లెల్ల రాములు, దామోదర్ గౌడ్, చిన్న రాంరెడ్డి, గోరటి శ్రీనివాసులు, రవీందర్,చిన్న, బాలు నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సభ్యులు రేష్మ, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాల్ రాజ్, శ్రీధర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, నాని యాదవ్,రావుల కేశవులు, వెంకటేష్,దున్న సురేష్, శ్రీశైలం మహేందర్, నవీన్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.