ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం
-సీనియర్ ఏరియా హెడ్ సురేష్ బాబు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ ఏరియా హెడ్ సురేష్ బాబు అన్నారు. ఆర్కేపీ పట్టణంలో ప్రజలకు కేర్ హెల్త్ సేవలు అందుబాటులో ఉండేందుకు నూతనంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గురువారం స్థానిక బీజోన్ సెంటర్లో హెల్త్ ప్లానర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అనుకోకుండా వచ్చే ప్రమాదాలు,ఆరోగ్య సమస్యల రక్షణకు,అయ్యే ఖర్చులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం మెడి లైఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్ లో సుమారు 150 మందికి ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులను అందించారు. ఈ కార్యక్రమంలో టేరిటారి మేనేజర్ విజయ్ కుమార్,మంచిర్యాల బ్రాంచ్ మేనేజర్ సతీష్ జాల,మెడిలైఫ్ వైద్యులు సతీష్,కేర్ సిబ్బంది సుజిత్,జాబు సతీష్,మెల్లెష్, గట్టెష్ తదితరులు పాల్గొన్నారు.