గిరిజన మహిళలల సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల
ఉత్పత్తులు
రాష్ట్రపతి భవన్ లో స్టాల్స్ ఏర్పాటు
ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఐఏఎస్
నేటి దాత్రి భద్రాచలం
గిరిజన మహిళలు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ద్వారా తయారు చేసే వివిధ రకాల సబ్బులు షాంపూలు, మిల్లెట్ బిస్కెట్లు కరక్కాయ పౌడర్ తేనె, న్యూట్రి మిక్స్ ఉత్పత్తులు గిరిజనులకు సంబంధించిన ప్రొడక్ట్స్ ప్రాచుర్యంలోకి తేవడానికి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
బుధవారం నాడు రాష్ట్రపతి భవన్ లో గిరిజన మహిళల ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసిన సమాచారం అందిన వెంటనే ఆయన మాట్లాడుతూ ఇండియా సాంస్కృతిక వైవిధ్యం సౌత్ ఆఫ్ ఇండియా నేపథ్యంలో భాగంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ మోటా సహకారంతో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఆదివాసి గిరిజన మహిళల వివిధ రకాల ఉత్పత్తులు వాటి వలన కలుగు ప్రయోజనాలు,ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు మరియు ప్రజలకు తెలియజేసి ప్రాచుర్యంలోకి తేవడం కొరకు ఐటీడీఏ భద్రాచలం నుండి మూడు ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించిన సిబ్బందిని వారు తయారు చేస్తున్న ఉత్పత్తులతో పాటు పంపించడం జరిగిందని అన్నారు. ఈనెల ఆరవ తేదీ నుండి 9వ తేదీ వరకు గిరిజన మహిళలు తయారుచేసిన వివిధ రకాల ఉత్పత్తులు అమ్మకాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రోగ్రాంలో మన రాష్ట్రం నుండే కాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రం నుండి వచ్చిన వివిధ రకాల యూనిట్ మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని వారి యొక్క ఉత్పత్తులను అమ్మకాలు జరుపుకుంటున్నారని అన్నారు.
మన ఐటీడీఏ శ్రీ లక్ష్మి గణపతి జాయింట్ లయాబిలిటీ గ్రూప్, భద్రాద్రి శ్రీరామ జె ఎల్ జి గ్రూప్, దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూప్ ఎం ఎస్ ఎం ఈ యూనిట్ మహిళలను పంపడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, రమాదేవి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.