మానవాళి మనుగడకు మూలం సైన్స్
నర్సంపేట,నేటిధాత్రి:
మానవాళి మనుగడకు మూలం సైన్స్ అని శ్రీ గురుకుల ఫౌండర్ మోతె సమ్మిరెడ్డి అన్నారు.నర్సంపేట మహేశ్వరం గ్రామంలో జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మహేశ్వరం శ్రీ గురుకుల ఫౌండర్ మోతె సమ్మిరెడ్డి పాల్గొన్నారు.మానవ జీవన మనుగడకు సైన్స్ తప్పనిసరి అవసరమని ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది నడిపిస్తున్నది సైన్స్ అని తెలిపారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,డిక్షనరీలు బహుమతిగా అందజేసి,విద్యార్థులు అనేక ఆవిష్కరణలు జరపాలని, బాగా కష్టపడి చదవాలని తెలిపారు.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత ప్రధానోపాధ్యాయులు స్వరూప, అర్జున్ సాగర్, వేణుబాబు,శ్రీలత, రాజేశ్వరి,రమేష్,రేఖ,శ్రీలత, కరుణాకర్,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.