మహనీయులను స్మరించుకుందాం..వారి అడుగుజాడల్లోనే నడుద్దాం
ఘనంగా మరాఠా యోధుని జయంతి వేడుకలు
చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి..ఘనంగా నివాళులర్పించిన మోటే ధర్మారావు
మూలపల్లి నేటి ధాత్రి
మహనీయులను స్మరించుకొని వారి అడుగుజాడల్లోనే నడవాలని హిందూ హృదయ సామ్రాట్..హిందూ ధర్మ రక్షకుడు..హిందూ సామ్రాజ్య స్వరాజ్ కోసం రాక్షసుల్లాంటి ఢిల్లీ సుల్తానులతో, మొఘలాయిలతో యుద్ధం చేసి, హిందూ దేవాలయాలను, హిందూ మహిళలను రక్షించి మొఘల్ పాలకుల నుండి విముక్తి ప్రసాదించిన హిందూ సామ్రాజ్యాధిపతి, చత్రపతి బిరుదాంకితుడు, మరాఠా పోరాట యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు అన్నారు. బుధవారం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని శివాజీ విగ్రహానికి ఆయన పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ తల్లి జిజియాబాయి బోధించిన మహనీయుల గాథలు విని అద్భుతమైన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆపాదించుకుని, తండ్రి షాహజీ ద్వారా పోరాటపటిమను, యుద్ధ విద్యలోని నైపుణ్యాలను అలవర్చుకొని 17 సంవత్సరాల వయసులోని హిందూ ధర్మ సంస్థాపన కోసం నడుం బిగించి..యుద్ధం చేసిన ఏకైక మరాఠా యోధుడు, హిందూ హృదయ సామ్రాట్ చత్రపతి శివాజీ అని అన్నారు. ఔరంగజేబు లాంటి కీచకులు చత్రపతి శివాజీ మహారాజును ఆయన కొడుకుని చంపాలని ప్రయత్నించిన ఆయన తప్పించుకుని తిరిగి ఔరంగజేబుపైన యుద్ధం ప్రకటించి హిందూ సామ్రాజ్య విస్తరణ కోసం, హిందూ అభివృద్ధి కోసం, హిందూ మహిళల ఔన్నత్యాన్ని పెంచడం కోసం, మొఘలాయిలతో తీవ్రమైన పోరాటం చేశాడన్నారు.