ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్న ఎంఈఓ గడ్డం మంజుల,
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రామ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసి గ్రామసభను ప్రారంభించిన ఎంఈఓ గడ్డం మంజుల, ఎంపీడీవో దేవవర కుమార్, స్పెషల్ ఆఫీసర్ , జి దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లు ప్రజాపాలన గ్రామసభలను ఏర్పాటు చేసి ప్రతి పేద బడుగు బలహీన కుటుంబాలకు ఈనెల 26న ప్రతి పేద కుటుంబానికి అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దేవ వర కుమార్, స్పెషల్ ఆఫీసర్ దినేష్ కుమార్, పంచాయతీ సెక్రెటరీ వీరన్న, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు