మండల కేంద్రంలో ర్యాలీ బాణాసంచా కాల్చి వేడుకలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల బిజెపి అధ్యక్షులుగా ఊర నవీన్ రావు ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిజెపి శ్రేణులు శుక్రవారం గణపురం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా అధ్యక్షులు నిశిదర్ రెడ్డి , జిల్లా సభ్యత్వ కన్వినర్ జన్నే మొగిలి పాల్గొని నూతనంగా ఎన్నికైన నవీన్ రావు ను ఘనంగా సన్మానించారు. అనంతరం బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పాపిరెడ్డి, దామోదర్ మండల ప్రధాన కార్యదర్శి దుగ్గిశెట్టి పున్నమ్ చందర్ మండల బూత్ అధ్యక్షులు రాజశేఖర్, హరిలాల్,మొగిలి, నరేందర్, రమేష్, నరేష్, భారతమ్మ, సాయి, జశ్వంత్, వంశీ కార్యకర్తలు కృష్ణ రెడ్డి, రాజశేఖర్,అరుణ, భార్గవ్, శివ, సంపత్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.