బాలానగర్ /నేటి ధాత్రి
బాలానగర్ మండలం మోతిఘనపూర్ గ్రామంలో నవదుర్గ బిల్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమ కంపెనీ విస్తరణ కొరకు జాయింట్ కలెక్టర్ మోహన్ రావు, ఎన్విరాల్ మెంట్ ఇంజనీర్ సురేష్ బాబుల ఆధ్వర్యంలో.. శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సమితి, ఎన్జీవో, సామాజికవేత్తల, రాజకీయ నాయకుల, గ్రామస్తుల, చుట్టుపక్క గ్రామ ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణలు భాగంగా పలువురు మాట్లాడుతూ… కంపెనీ విస్తరణ తమకు సమంజసమేనని కానీ కాలుష్యాన్ని నియంత్రించాలని, మొక్కలను నాటి పెంచాలని, గ్రామస్తులకు ఉద్యోగాలలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సి ఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచనలు చేశారు. ఇక్కడ జరిగిన కార్యక్రమం అంతా రికార్డు చేయబడుతుందని, ఈ వీడియోని ఢిల్లీకి పంపించి, అక్కడి అధికారులు పరిశీలించాక అనుమతులు ఇవ్వడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ వేతలు, ఎన్జీవోలు, స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.