సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు
చేర్యాల.. నేటిధాత్రి….
చేర్యాల కోర్టు ఏర్పాటుతో చేర్యాల ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగనుందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ జిల్లా అధ్యక్షుడు అందె బీరయ్య లు అన్నారు. పట్టణ కేంద్రంలో శనివారం జరిగే జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావలసిందిగా సీపీఐ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులకు మండల న్యాయవాదులు పొన్నం సురేష్ కృష్ణ, గుస్క వెంకటేశం, రాజురెడ్డి లు వారికి ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చేర్యాలకు కోర్టు రావడం మంచి శుభ పరిణామం అని పేద, మధ్యతరగతి వారికి దూర ప్రాంతంలో ఉన్న కోర్టులకు వెళ్లే ఖర్చులు అధికంగా ఉండేవని ఇప్పుడు కోర్టు చేర్యాలలో ప్రారంభం అవుతుండడంతో ఖర్చులు తగ్గనున్నయని అన్నారు. చేర్యాలలో కోర్టు ఏర్పడటం మంచి శుభ పరిణామం అని అన్నారు. నాలుగు మండలాలలో మూడు వేల కేసులకు పైగా ఉన్నాయని, నేడు ఆ కేసులు చేర్యాల ఏర్పడే కోర్టు పరిధిలోకి వస్తాయని ప్రజలకు చాలా సౌకర్యంగా ఉండడంతోపాటు ఎంతో మేలు జరుగుతుందని వారు అన్నారు. కోర్టు ఏర్పాటుకు కృషి చేసిన న్యాయవాదులు, అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.