
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో తాహారాపూర్ గ్రామంలో ముమ్మరంగా తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో జిల్లా కేంద్రం నుండి జిల్లా ప్రజా పరిషత్ సీఈవో విద్యాలత ఆధ్వర్యంలో తహరాపూర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల సర్వే తనిఖీలు, ఎంపీడీవో మిడ్ డే మీల్స్ అంగన్వాడి సెంటర్, స్కూల్ కాంపౌండ్, కిచెన్, మీల్స్, నర్సరీలు తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఫణి చంద్ర, మండల ప్రజా పరిషత్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.