
కురుమ కులస్తుల అరాధ్య దైవం
కామారెడ్డి జిల్లా/జుక్కల్ నేటి ధాత్రి:
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల కురుమ కులస్తుల అరాధ్య దైవం జై బొమ్మ గోండేశ్వర జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు.. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా కురుమ మండల అధ్యక్షులు ఖండుగొండ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని రాబోయే సంవత్సరంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అన్నారు… నాయకులకు ప్రజాప్రతినిధులకు గ్రామ పెద్దలకు ఘనంగా శాలువతో ఘనంగా సన్మానించారు..
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శివానంద్, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త రమేష్, మాజీ ఎంపీపీ లక్ష్మణ్ పటేల్, మాజీ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్, మాజీ ఉపసర్పంచ్ భాను ప్రసాద్ గౌడ్ ,గంగు నాయక్, విట్టు పటేల్, ఆర్మీ శ్రీకాంత్ ,కురుమ గ్రామ అధ్యక్షులు రాము గొండ, శంకర్ గొండ, విట్టుగొండ, మల్లు గోండు, హన్మగోండ, సంతోష్ గోండ, బాలాజీ గోండ, బాలాజీ గోండ, సాయి గోండ, తదితరులు కులస్తులు ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు