*తేదీ 29-11-2024
ఉదయం: 9:00 గంటలకు*
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యకర్తలకు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మరియు వరంగల్ రూరల్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు ఈ నెల 29 దీక్షదివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిద్దాం తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి, ఉద్యమ చరిత్రపై చెరిగిపోని ముద్ర వేసిన మహా నాయకులు కేసీఆర్ నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను మరొక్కసారీ గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దీక్ష దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిద్దాం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు, శాసన మండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్ హాజరు అవుతుంది కాబట్టి శాయంపేట మండల బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు,అభిమానులు అందరు పాల్గొనాలని పిలుపునిచ్చారు.