భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని కాకతీయ కాలనీ లో సిపిఐ పార్టీ సభ్యత్వం కార్యక్రమం నేరెళ్ల జోసెఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు. ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ దేశం లో ఏ రాజకీయ పార్టీకి లేని చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే వుంది అని అన్నారు.99 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ డిసెంబర్ కు వంద సంవత్సరాలు అడుగుపెడుతుందని తెలిపారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఘనత సిపిఐ కి వుంది అని అన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతుందన్నారు. కాకతీయ కాలనీ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేపడతామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరారు. సిపిఐ వంద వ సంవత్సర ప్రారంభ వేడుకలను జయప్రదం చేయాలని ప్రవీణ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ కాలని శాఖ కార్యదర్శి కన్నూరి మహేష్, మంచినీళ్ళ వైకుంఠం, రేణిగుంట్ల రాజ్ కుమార్, దుర్గం పుష్పలత, శనిగరపు సరిత, ఒంటేరు రాజేష్, ఉడుత ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు